తప్పుడు సమాచారాన్ని అరికట్టాలి

0
1


తప్పుడు సమాచారాన్ని అరికట్టాలి


ఎంసీజే విద్యార్థులతో సీనియర్‌ జర్నలిస్టు సప్తగిరి, అధ్యాపకులు

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాలు అత్యంత శక్తిమంతంగా మారి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని సీనియర్‌ జర్నలిస్టు, ఫాక్ట్‌ చెక్‌ శిక్షకులు గోపగోని సప్తగిరి అభిప్రాయపడ్డారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తల ప్రచారాన్ని ప్రతి ఒక్కరు అరికట్టాలన్నారు. తప్పుడు వార్తలతో సమాజంలో అల్లర్లు చెలరేగి హింసకు దారి తీస్తుందన్నారు. ఇటువంటి వాటిని గుర్తించేందుకు గూగుల్‌ న్యూస్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. సమాచారంలో మార్పు గుర్తించడం, తప్పుడు వార్తల్ని అన్వేషించడం, 10 సెకన్లలోపే సత్యశోధన చేయడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. కార్యక్రమంలో విభాగాధిపతి ప్రభంజన్‌యాదవ్‌, అధ్యాపకులు రాజారాం, చంద్రశేఖర్‌, శాంతాబాయి తదితరులు ఉన్నారు.

26లోపు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివి పరిధి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీ.కాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ(ఎల్‌) కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల రెగ్యులర్‌ పరీక్ష ఫీజును ఈ నెల 26లోపు చెల్లించాలని సీవోఈ ఘంటా చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో 28 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here