తప్పు తెలుసుకుని.. తనకు తానే జరిమానా విధించుకున్న కలెక్టర్!

0
1


నిబంధన తప్పినందుకు ఓ జిల్లా కలెక్టర్ తనకు తానే జరిమానా విధించుకుని ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే ఇటీవల ప్లాస్టిక్ కప్పులో టీ తాగారు. దీంతో ఓ విలేకరి ఆయన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేదం ఉన్నప్పుడు.. ప్లాస్టిక్ కప్‌లో టీ తాగడం నిబంధనలు అతిక్రమించినట్లు కాదా అని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ తనకు తాను రూ.5000 జరిమానా విధించుకున్నారు.

Read also: ఉల్లి ధరలపై జోకుల లొల్లి.. నవ్వులే నవ్వులు!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీడ్ జిల్లాలో అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణ వివరాలను తెలిపేందుకు కలెక్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విలేకరులకు ప్లాస్టిక్ కప్‌లలో ప్లాస్టిక్ డిస్పోజల్ కప్పుల్లో టీ ఇచ్చారు. దీంతో విలేకరులు కలెక్టర్‌ను నిలదీశారు. ప్లాస్టిక్ వస్తువులపై నిషేదాన్ని మీరే అమలు చేయకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ తమ తప్పు తెలుసుకున్నారు. అటెండర్ చేసిన తప్పుకి తానే బాధ్యత వహిస్తున్నానని తెలుపుతూ.. తనకు తాను రూ.5వేలు జరిమానా విధించుకున్నారు. ప్రెస్‌మీట్ తర్వాత సిబ్బందితో సమావేశమైన కలెక్టర్.. ఇకపై కార్యాలయంలో ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని ఆదేశించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here