తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యండి, పుండు మీద కారం చల్లారు, ప్రభుత్వం విఫలం !

0
3


తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యండి, పుండు మీద కారం చల్లారు, ప్రభుత్వం విఫలం !

న్యూఢిల్లీ: తమిళనాడుకు మరో ఐదు రోజులు కావేరీ నీరు విడుదల చెయ్యాలని కావేరీ నీరు సరఫరా నిర్వహణ బోర్డు

(సీడబ్ల్యుఆర్ బి) ఆదేశాలు జారీ చేసింది. కావేరీ నీరు నిర్వహణ బోర్డు అధ్యక్షుడు నవీన్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడుకు నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ కావడంతో మండ్య, మైసూరు ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది.

కావేరీ నీటి నిర్వహణ బోర్డు తీసుకున్న నిర్ణయంతో మండ్య, మైసూరు జిల్లా రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై 20వ తేదీ నుంచి ప్రతిరోజు తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేస్తున్నారు. అయితే మరో ఐదు రోజులు తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ కావడంతో కర్ణాటక ప్రభుత్వం షాక్ కు గురైయ్యింది.

ఆగస్టు 8వ తేదీ మళ్లీ కావేరీ నీరు నిర్వహణ బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కేఆర్ఎస్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎక్కువగా లేదనే వాదనలు కర్ణాటక ప్రభుత్వం వినిపించాలని మండ్య, మైసూరు జిల్లా రైతులు, ప్రజలు డిమాండ్

చేస్తున్నారు.

కర్ణాటక ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించకపోవడం వలనే కావేరీ నీరు విడుదల చెయ్యాలని కావేరీ నీరు నిర్వహణ బోర్డు ఆదేశాలు జారీ చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. జులై 31వ తేదీ కేఆర్ఎస్ డ్యాంలో 80. 80 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో ఐదు రోజులు కావేరీ నీరు తమిళనాడు విడుదల చేస్తే మా పరిస్థితి ఏమిటి అని మండ్య, మైసూరు జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here