తల్లిపాల విశిష్టతపై ప్రచారం చేయాలి

0
1


తల్లిపాల విశిష్టతపై ప్రచారం చేయాలి

మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి సత్యనారాయణ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తల్లిపాల విశిష్టత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జనహిత భవన్‌లో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుడే జన్మించిన శిశువులకు గంట లోపు తల్లిపాలు తాగిస్తే వ్యాధినిరోధకశక్తి పెంపొందుతుందని, ఆరు నెలల పాటు బిడ్డకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. నవజాత శిశువు జన్మించినప్పటి నుంచి వెయ్యి రోజుల వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాహారం అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ రాధమ్మ, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి, జడ్పీ సీఈవో కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఫోన్‌ఇన్‌కు 8 ఫిర్యాదులు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భూరికార్డుల సమస్యలపై బుధవారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌కు 8 మంది రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాలనాధికారి సత్యనారాయణ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here