తల లేని మొండానికే అంత్యక్రియలు…! మణిక్రాంతి తల కోసం వాగులో గాలింపు చర్యలు…!

0
0


తల లేని మొండానికే అంత్యక్రియలు…! మణిక్రాంతి తల కోసం వాగులో గాలింపు చర్యలు…!

విజయవాడలోని సత్యనారయణ పురం శ్రీనగర్ కాలనీలో భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన మణికాంత్రి మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతదేహానికి తల లేకుండా ఉన్న మొండెంతోనే అంత్యక్రియలు చేశారు. కాగా ఆదివారం మధ్యహ్నాం నుండి కూడ బుడమేరు పడవేసిన మణిక్రాంతి తల కోసం తీవ్రంగా గాలింపులు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరికి తల లేని మొండాన్ని దహనం చేశారు.

మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు

ఆదివారం విజయవాడ సత్యనారయణపురంలో శ్రీనగర్ కాలనీలో దారుణం చేటుచేసుకున్న విషయం తెలిసిందే.. భార్య విడాకులు ఇచ్చిందని కక్ష్య పెంచుకున్న భర్త ప్రదీప్ మణిక్రాంతిని నరికి చంపాడు. అనంతరం తల, మొండాన్ని వేరు చేశాడు. తలను తీసుకుని బయటకు వచ్చి గ్రామస్థులను ఒక్కసారిగా బయాందోళనలకు గురి చేశాడు. అయితే తలకు తీసుకుని బయటకు వచ్చిన నిందితుడు దాన్ని బుడమేరులో పడేశాడు.

తలను నరికి, వేరు చేసి బుడమేరులో పడేసిన హంతకుడు,

తలను నరికి, వేరు చేసి బుడమేరులో పడేసిన హంతకుడు,

అనంతరం విడాకులు ఇవ్వడంతోనే తాను కక్షతో నరికి చంపానని పోలీసులకు లోండిపోయాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, సంఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అనంతరం తల కోసం బుడమేరులో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నదీ ప్రవాహానికి తల దొరక్కపోవడంతో తల లేకుండానే మొండానికి పోస్టుమార్టం చేయించి తల లేని మొండానికి అంత్యక్రియలు నిర్వహించారు.

తల లేకుండా ప్రదీప్‌కు శిక్ష పడుతుందా...?

తల లేకుండా ప్రదీప్‌కు శిక్ష పడుతుందా…?

కాగా భార్యను హత్య చేసిన ప్రదీప్‌పై కేసును నమోదు చేసిన పోలీసులు,అందుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే తల లేకపోవడంతో సాక్ష్యాలు సమర్పించడంపై కొంత ఇబ్బందులు నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. దీంతో నిందితుడి శిక్షపై కూడ పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇందుకోసమే శవానికి అంత్యక్రియలు నిర్వహించినా… తల కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి. అయితే నిందితుడే స్వయంగా ఒప్పుకోవడంతో పాటు తలను తీసుకెళుతున్న వీడీయో కూడ ఉండడంతో శిక్ష పడడం ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here