తారకరాముడి జన్మదినం.. అవసరానికి సాయం.. సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం

0
6


తారకరాముడి జన్మదినం.. అవసరానికి సాయం.. సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం

హైదరాబాద్ : అందాల తారక రాముడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. 1976, జులై 24వ తేదీన జన్మించిన కేటీఆర్ 43 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చిన్న వయసులోనే ది లీడర్‌గా ఎదిగిన ఆయన ఎవరినైనా సరే చెరగని చిరునవ్వుతో ఇట్టే ఆకట్టుకుంటారు. ఆ క్రమంలో ఈసారి కేటీఆర్ జన్మదినాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్లాన్ చేశారు ఆయన శ్రేయోభిలాషులు. కేకులు, పూలబొకేలు వద్దంటూ పదిమందికి చేయూత అందించేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కేటీఆర్ పుట్టినరోజు స్పెషల్.. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్

జులై 24వ తేదీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం పురస్కరించుకుని ఆయన శ్రేయోభిలాషులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదిమందికి ఉపయోగపడే విధంగా కొత్త ఛాలెంజ్‌కు తెర లేపారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేకులు, పూలబొకేలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ ఇవ్వకుండా అవసరం ఉన్నవారికి వీలైనంత సాయం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు

ట్విట్టర్ వేదికగా ఒక వినూత్నమైన ప్రచారం ప్రారంభించారు.

గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ (#GiftASmileChallenge – A life lived for others is a life worthwhile. Real achievement is when you gift a smile and wipe a tear) పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. కేటీఆర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అనుచరులు, పార్టీ నేతలు తమ శక్తి మేర ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. అవసరం ఉన్నవారికి ఆర్థికంగా గానీ ఇతరత్రా వివిధి రూపాల్లో గానీ ఎంతో కొంత సాయం అందిస్తుండటం విశేషం.

కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!

అనూహ్య స్పందన.. చేయూత

అనూహ్య స్పందన.. చేయూత

కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ కార్యక్రమంలో చాలామంది భాగస్వాములు అవుతున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ అంబులెన్స్ కొనుగోలు చేసే క్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 10 లక్షల రూపాయల చెక్కు అందించారు. ఇలా తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు సైతం స్పందిస్తున్నారు. వీలైనంత మేర సాయమందిస్తున్నారు.

 నెలకు 20 మందికి కేటీఆర్ సాయం..!

నెలకు 20 మందికి కేటీఆర్ సాయం..!

సమస్య ఉందని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే ఏదోరకంగా స్పందిస్తారనే పేరుంది. ఆ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా ఎంతోమందికి సాయం అందించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కేసుల్లో ఆసుపత్రుల్లో ఉన్నవారి వివరాలతో ట్వీట్ చేస్తే.. ఆయన కార్యాలయం సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఆ క్రమంలో ఆయా ఆసుపత్రులకు ఎల్‌వోసీ లు పంపిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అలాగే గల్ఫ్ బాధితులు స్వదేశానికి తిరిగివచ్చేలా సాయం అందించడం.. ప్రాంతీయ బేధాలు మరిచి ఏపీకి చెందిన చిన్నారికి కంటి ఆపరేషన్‌ చేయించడం తదితర పేపర్ క్లిప్పులతో రూపొందించిన గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ వీడియో ప్రోమో ఆకట్టుకుంటోంది. కేటీఆర్ నెలకు 20 మందికి సాయం చేస్తున్నారని.. ఆ క్రమంలో మనం ఏడాదికి ఒక్కరికైనా సాయం చేయలేమా అంటూ పేర్కొన్న మేసేజ్ ఆలోచింపజేసే విధంగా ఉంటోంది.

200 కోట్ల లొల్లేంది హరీషన్నా.. ఆనాడు ‘వైఎస్ఆర్’ మీద అరిస్తిరి.. ఈనాడు “కేసీఆర్” అదే దారిలో..!

 వివిధ రూపాల్లో సాయం.. అదే కార్యక్రమ ఉద్దేశం

వివిధ రూపాల్లో సాయం.. అదే కార్యక్రమ ఉద్దేశం

గిఫ్ట్ ఏ ఛాలెంజ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగా వృద్ధ, అనాధ ఆశ్రమాలకు విరాళాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సాయం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన.. కాలనీల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు.. పేద ప్రజలకు వైద్య సాయం.. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు ఆసుపత్రుల్లో రక్షిత మంచినీటి సౌకర్యం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు పుస్తకాలు, నోటు బుక్స్ అందించడం.. హరితహారం కోసం మొక్కలు నాటడం.. ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఇదే పెద్ద గిఫ్ట్ కావాలని ఆశిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here