తాళాలు వేసిన రెండిళ్లలో చోరీ

0
2


తాళాలు వేసిన రెండిళ్లలో చోరీ

మూడిళ్లల్లో దొంగతనానికి యత్నం

కామారెడ్డి(మాచారెడ్డి), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో తాళాలు వేసిన రెండిళ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అలాగే మరో మూడిళ్లలో చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనలో పబ్బ సిద్ధిరాములు ఇంట్లో రెండు తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, ఆకుల కిష్టయ్య ఇంట్లో రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లారు. తాళాలు వేసి ఉన్న మరో మూడిళ్లలో సైతం దొంగలు వాటిని పగుల గొట్టి లోనికి ప్రవేశించారు. ఘటనా స్థలాన్ని పట్టణ సీఐ రామకృష్ణ, ఎస్సై రవికుమార్‌ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here