తిప్పరా మీసం.. మరో `అర్జున్‌ రెడ్డి` కథ!

0
0


విభిన్న చిత్రాల నటుడు శ్రీవిష్ణు హీరోగా కృష్ణ విజయ్‌ ఎల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మరో ఇంట్రస్టింగ్ మూవీ తిప్పరా మీసం. ఇన్నాళ్లు సాఫ్ట్ రోల్స్‌ మాత్రమే చేసిన శ్రీ విష్ణు ఈ సినిమాలో నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా చిత్రయూనిట్‌ తిప్పరా మీసం థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్‌లో శ్రీవిష్ణు సీన్స్‌ అన్ని సెన్సేషనల్‌ హిట్‌ అర్జున్‌ రెడ్డిని గుర్తుచేసేలా ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ పాత్రను ఏ షేడ్స్‌లో అయితే డిజైన్‌ చేశారో దాదాపు శ్రీ విష్ణు పాత్ర కూడా అదే తరహాలో ఉంది. డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి కథే తిప్పరామీసం. అయితే ఈ సినిమాలో రోహిణి, శ్రీవిష్ణుల మధ్య వచ్చే మదర్‌ సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Also Read: గ్లామర్‌ షో వర్క్‌ అవుట్ అయ్యింది.. బిగ్‌ చాన్స్‌ కొట్టేసిన రకుల్‌!

తిప్పరా మీసం తెలుగు రాష్ట్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్‌కు సొంత చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.
Also Read: నందమూరి అభిమానులకు నిరాశ.. వారసుడి ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Also Read: తమిళ `అర్జున్‌ రెడ్డి`కి తీరని కష్టాలు.. రిలీజ్‌ మరోసారి వాయిదా!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here