తీజ్‌ వచ్ఛే. సంబరం తెచ్ఛే.

0
0


తీజ్‌ వచ్ఛే. సంబరం తెచ్ఛే.

 
గజ్యానాయక్‌తండాలో తీజ్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న గిరిజన యువతీ-యువకులు

గజ్యానాయక్‌తండా (మాచారెడ్డి), న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌తండా గ్రామంలో గిరిజనులు తీజ్‌ వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గిరిజన యువతులు అత్యంత నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలతో పుట్ట మట్టిని వెదురు బుట్టల్లో పోసి పెంచిన గోధుమ నారును తీజ్‌గా పిలుస్తారు. గిరిజన భాషలో తీజ్‌ అంటే గోధుమ నారు అని చెప్తుంటారు. ఈ తీజ్‌ ఎంత ఏపుగా పెరిగితే గిరిజనులు పాడి-పంటలు, గోడ్డూ-గోజ, పిల్లా-పాపలతో అంత ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారనేది వారి నమ్మకం. అందుకే పెళ్లికాని యువతులు ఈ తీజ్‌ను ఉప్పూ-కారం లేని ఒంటి పూట భోజనంతో పెంచి పోషిస్తారు. తొమ్మిది రోజుల అనంతరం ఇలా పెరిగిన తీజ్‌ను తమ కుటుంబ సభ్యులకు పంచుతూ ఆడబిడ్డలు కట్న-కానుకలు స్వీకరిస్తారు. అంగరంగ వైభవంగా జగదాంబ దేవికి పూజలు నిర్వహించి ఆట-పాటలు నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు-కుంటలు, వాగులు-వంకల్లోని నీటిలో నిమజ్జనం చేస్తారు. సంప్రదాయ నృత్యాలతో సాగే ఈ గిరిజన పండుగను చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఈ వేడుకల్లో మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు, గ్రామ సర్పంచి హంజీనాయక్‌, ఉప సర్పంచి తోకల కిషన్‌, మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌, వార్డు సభ్యులు గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here