తీర్మానం చేసిన పనులకే నిదులు ఖర్చు చేయాలి

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా మంగళవారం మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, గ్రామంలో ప్లాస్టిక్‌ కవర్లను సేకరించి సిద్ధం చేసిన తర్వాత మండల వారీగా రీసైక్లింగ్‌ కోసం నగరపాలక సంస్థకు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామ సభలు సమిష్టిగా నిర్ణయించి తీర్మానాలను చేసిన పనులకే నిధులను ఖర్చు చేయాలని చెప్పారు. హరిత హారంలో గ్రామాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటి వాటి సంరక్షణకు కషిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రణాళికలలో గుర్తించిన పనులను ఆయన పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు అపరిశుభ్రంగా ఉన్నందున ప్రధానోపాధ్యాయునిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిఈఓకు చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రంలోగా మొత్తం పరిశుభ్రం చేసి పోటోలు పంపించాలని గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. పవర్‌ హాలిడే సందర్భంగా గ్రామంలోని శిథిలమైన వంకర తిరిగిన స్తంభాలను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్‌ దీపాల కోసం మూడవ వైరు లూస్‌గా ఉన్న సరి చేసుకోవాలని చెప్పారు. గ్రామంలో శిథిలమైన భవనాలు వాడకంలో లేని వదిలిపెట్టిన బోరు బావులు ఓపెన్‌ బావులను పూడ్చేయాలన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here