తీహార్ జైలులో ఆడదెయ్యం తిరుగుతోందట: భయపడి ఛస్తోన్న మగ ఖైదీలు!

0
6


తీహార్ జైలులో ఆడదెయ్యం తిరుగుతోందట: భయపడి ఛస్తోన్న మగ ఖైదీలు!

న్యూఢిల్లీ: కరడు గట్టిన నేరస్తులు, మానవత్వం మచ్చుకైనా కనిపించని నరహంతకులు, డెకాయిట్లు శిక్షను అనుభవిస్తోన్న తీహార్ జైలు అది. జనాలను భయ పెట్టడమే తప్ప భయం అనేది ఏ మాత్రం తెలియని క్రూరులు. అలాంటి ఖైదీలు ఇప్పుడు చిన్నపిల్లల్లా భయపడుతున్నారు. తమ బ్యారక్ లో అడుగు పెట్టాలంటే హడలి ఛస్తున్నారు. తమను ఇంకే కారాగారానికైనా పంపించండంటూ జైలు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. మహిళా ఖైదీలదీ ఇదే పరిస్థితి. బ్యారక్ లో ఉండలేమంటూ వారు వాపోతున్నారు. దీనికి కారణం- ఓ ఆడదెయ్యం అట.

తీహార్ కేంద్ర కారాగారం అధికారలు శుక్రవారం ఓ విచిత్రమై ఫిర్యాదును అందుకున్నారు. ఈ ఫిర్యాదు చేసింది వేరెవరో కాదు.. జైలు శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలే. జైలులో ఓ ఆడదెయ్యం తిరుగుతోందని, ఈ దాని నుంచి తమను కాపాడాలనేది వారి ఫిర్యాదు సారాంశం. కావాలంటే- తమను వేరే జైలుకు పంపించినా సంతోషంగా వెళ్తామని.. ఇక్కడ ఉండలేమని వారు వాపోతున్నారు. దీనికి నమ్మదగ్గ కారణాలనే వారు చూపుతుండటం, చెబుతుండటం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది.

తీహార్ జైలులో మహిళా ఖైదీలను ఉంచిన బ్యారక్ నంబర్ 6లో ఇటీవలి కాలంలో ప్రతిరోజూ తెల్లవారు జామున సరిగ్గా 2 గంటల సమయంలో ఓ మహిళ ఏడుస్తోన్న శబ్దం వినిపిస్తోందట. సరిగ్గా సమయం 2 గంటలు కొట్టగానే.. ఏడుపు మొదలవుతుందని, కర్ణ కఠోరమైన కంఠంతో, విషాదం నిండిన స్వరంతో ఆ ఏడుపు వినిపిస్తుందని ఖైదీలు ఫిర్యాదు చేశారు. కొంతకాలం నుంచీ ప్రతీరోజూ తెల్లవారు జామున సరిగ్గా 2 గంటలకు ఈ ఏడుపు వినిపిస్తోందని, ఓ నీడలాంటి ఆకారం కనిపిస్తోందని వారు చెబుతున్నారు.

బ్యారక్ నంబర్ 6లో శిక్షను అనుభవిస్తోన్న ఓ మహిళా ఖైదీ రెండు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నారని, ఆమె దెయ్యంలా తిరుగుతోందని చెబుతున్నారు. తాను చేయని తప్పునకు శిక్ష అనుభవించాల్సి రావడాన్ని తట్టుకోలేక.. జైలులో ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఆమె దెయ్యమై తిరుగుతోందని, ఆమె ఊపిరి పోయిన సమయానికి ఆ ఏడుపు ఆరంభమౌతోందని, కొన్ని నిమిషాల పాటు వినిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. ఇలా ఒకరు కాదు.. చాలామంది మహిళా ఖైదీలు జైలులో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఫిర్యాదుపై ఏం చేయాలో తెలియక తీహార్ జైలు అధికారులు తల పట్టుకుంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here