తుది దశలో నూత్‌పల్లి గురడి కాపు కళ్యాణ మండపం

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురడి కాపు పెళ్లిపందిరి సిద్ధమైంది. నందిపేట్‌ మండలం నుత్‌పల్లి గ్రామ గురడీ రెడ్డి కళ్యాణ మండపం నిర్మాణం తుది దశకు చేరుకుంది. కల్యాణ మండపం సిద్ధం చేయడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలో ఇక్కడ పెళ్లిళ్లు జరుగనున్నాయి. మండపం, భోజనశాల, నిల్వగది, వంటశాల, మూత్రశాలల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక తుది మెరుగులు దిద్దడమే తరువాయి. దీని నిర్మాణానికి గ్రామానికి చెందిన 56 గురడీ కాపులు కలిసి ఒక్కొక్కరు 6 లక్షల చొప్పున సంఘంలో జమ చేసి 3 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో కూడిన భారీ కల్యాణ మండపాన్ని కట్టడానికి పథకం ప్రకారం పనులు చేపట్టారు. తెరాస నాయకులు బంగారు సాయరెడ్డి దగ్గరుండి మండపం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. మండలంలో ఎక్కడా లేని విధంగా నాలుగు ఎకరాల విశాల భూమిలో నిర్మిస్తున్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు లభ్యమయ్యేలా చేయనున్నారు. వివాహా, శుభకార్యాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పక తప్పదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here