తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయం

0
0


తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయం

● కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ

మాట్లాడుతున్న బండారు దత్తాత్రేయ

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిందని, భాజపా తెరాసకు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి, పెర్కిట్‌లలో శనివారం భాజపా సభ్యత్వ నమోదులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి స్వయంగా సభ్యత్వం చేయించారు. అనంతరం పెర్కిట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెరాసపై భ్రమలు తొలగిపోతున్నాయని, పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కూతురు ఓటమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌, తెరాసకు కంచుకోటలుగా ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ పార్లమెంటు స్థానాలను భాజపా కైవసం చేసుకుందని, సికింద్రాబాద్‌ స్థానాన్ని వరుసగా అయిదుసార్లు గెలవడం గొప్ప విషయమన్నారు. పురపాలక ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు యువకులు, ప్రజలు, అన్నివర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. పురపాలక నూతన చట్టంలో గవర్నర్‌ సవరణలు చేయడాన్ని భాజపా స్వాగతిస్తోందని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జాతీయ బీడీకార్మిక సలహామండలి ఉపాధ్యక్షుడు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్‌ శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌కుమార్‌, నియోజకవర్గ బాధ్యుడు ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డి, నాయకులు బద్దం లింగారెడ్డి, పెద్దొళ్ల గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉదయ్‌, రాజన్న పాల్గొన్నారు.

ఆలయంలో పూజలు

కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మామిడిపల్లి, పెర్కిట్‌లలో ప్రముఖ వ్యాపారి విశాఖ గంగారెడ్డి, రోటరీ మాజీ అధ్యక్షుడు చంద్రసేనారెడ్డి, విశ్రాంత డిప్యూటీ డీఈవో బుడ్డు శంకర్‌, అల్జాపూర్‌ గంగామోహన్‌, ముక్తార్‌లకు స్వయంగా పార్టీ సభ్యత్వం ఇచ్చారు. అనంతరం రమా సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here