తెరాసకు రైతులే బుద్ధి చెబుతారు

0
4


తెరాసకు రైతులే బుద్ధి చెబుతారు

● భాజపా ఏమిచ్చిందో చెప్పాలి

● కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో నేతలు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెరాసను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, త్వరలో ఆ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకుంటే తగిన గుణపాఠం తప్పదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు హామీ ఏమైందని భాజపాను నిలదీశారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. తెరాస పాలన, కవితపై ఉన్న వ్యతిరేకతతో రైతులందరు ఒక్కటై ఓడించారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో దోమలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్‌ చేసినా స్పందించట్లేదన్నారు. జిల్లా కలెక్టర్‌ తమ వినతిని స్వీకరించేందుకు కూడా సమయం ఉండట్లేదన్నారు. జిల్లాస్థాయిలో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసి కార్యకర్తల కేసులను వాదిస్తామన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో కార్యకర్తలే తెలియజేయాలన్నారు. ఇందులో మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీసభ్యులను సన్మానించారు. ఈ సమావేశంలో టీసీపీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్‌, ప్రేమలత అగర్వాల్‌, అర్బన్‌ ఇన్‌ఛార్జి తాహెర్‌బిన్‌ హందాన్‌, బాన్సువాడ ఇన్‌ఛార్జి బాల్‌రాజ్‌, నగర అధ్యక్షుడు కేశ వేణు, కిసాన్‌ కేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here