తెరాస ప్రభుత్వంలోనే నిజామాబాద్‌ అభివృద్ధి

0
2


తెరాస ప్రభుత్వంలోనే నిజామాబాద్‌ అభివృద్ధి

నిజామాబాద్‌: నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్‌ గుప్తా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నగరంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు పూర్తి కావడంతో శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెరాస ప్రభుత్వంలో నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నగర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. నిజామాబాద్ నగరాన్ని పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here