తెలంగాణలో భాజపాను బలోపేతం చేస్తాం

0
4


తెలంగాణలో భాజపాను బలోపేతం చేస్తాం

మురళీధర్‌గౌడ్‌ను సన్మానిస్తున్న భాజపా నాయకులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణలో భాజపాను బలోపేతం చేసి త్వరలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయనున్నట్లు జాతీయ బొగ్గు గనుల సంస్థ స్వతంత్ర డైరెక్టర్‌ డా. మురళీధర్‌గౌడ్‌ పేర్కొన్నారు. డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి కామారెడ్డికి ఆదివారం వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అహంకార పాలన సాగిస్తోందని, కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తెరాస మోసాలను భాజపా కార్యకర్తలు ప్రజల్లో ఎండగట్టాలని, భవిష్యత్తులో భాజపాకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభులు మర్రి రాంరెడ్డి, అరుణతార, పట్టణాధ్యక్షుడు భానుప్రకాష్‌, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు రమేష్‌, స్వామి, శ్రీకాంత్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/137004.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here