తెలంగాణవాసులకు గుడ్‍‌న్యూస్! రిలయన్స్ జియో జాబ్ మేళా

0
3


తెలంగాణవాసులకు గుడ్‍‌న్యూస్! రిలయన్స్ జియో జాబ్ మేళా

మూడేళ్ల క్రితం టెలికం రంగంలోకి అడుగిడిన జియో దూసుకెళ్తోంది. నెల నెలకు లక్షలాది కస్టమర్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ కంపెనీ భాగ్యనగరంలో జాబ్ మేళా నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో 300 మంది అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం (సెప్టెంబర్ 30) జాబ్ మేళా నిర్వహిస్తోంది.

ఈ మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ సంచాలకులు వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని రామాంతపూర్‌లోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు.

ఐటీఐలో ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తి చేసినవారు అర్హులు అన్నారు. తెలంగాణలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అక్టోబర్ 15వ తేదీన ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో జాబ్ మేళా నిర్వహిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here