తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ సార్‌ దిక్సూచి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రములోని తెరాస యువజన విభాగం పట్టణ కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ 85వ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ యూత్‌ యువజన విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెరాస యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎంతో కష్ట పడడం జరిగిందని, కేసీఆర్‌కు ఒక గురువులా ఉండి ఉద్యమం ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు సహకారం అందించిన వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అన్నారు. మేధావులను అన్ని వర్గాల వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఉండి నడిపించిన మహానుభావుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అన్నారు. ఆయన ఆశయాలను కెసిఆర్‌ ముందుకు తీసుకెళ్లి బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. జయశంకర్‌ సార్‌ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపడం ఆయనకు నిజమైన నివాళి అన్నారు. జయశంకర్‌ సార్‌ అశయాలను తెరాస యువజన విభాగం పట్టణ నాయకులు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమములో తెరాస యువజన విభాగం పట్టణ నాయకులు సురేష్‌, సతీశ్‌, రాజ రెడ్డి, భాస్కర్‌, రాజు యాదవ్‌, ఫెరోజ్‌, భరత్‌, బాబా గౌడ్‌, రాకేష్‌, సంజీవ్‌, నవీన్‌, సాయి, సుమంత్‌, వెంకట్‌, శివ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here