తెలంగాణ ఉద్యమ ఫలితం ఇదేనా?

0
2


తెలంగాణ ఉద్యమ ఫలితం ఇదేనా?


రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రజాసంఘాల ప్రతినిధులు

బోధన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకొన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచి బహుమతి ఇచ్చారని ఇఫ్టూ కార్మిక సంఘం నాయకులు ఎద్దేవా చేశారు. పట్టణంలోని బియ్యం మిల్లర్ల సంఘ భవన్‌లో ప్రజాసంఘాల ప్రతినిధులతో సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌ మాట్లాడారు. బతుకులు బాగు చేసుకోవడానికి రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారే కానీ సమస్యలు పెంచుకోవడానికి కాదన్నారు. న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించడం ఎక్కడి రాజనీతి అని ప్రశ్నించారు. సమ్మెను విఫలం చేయడానికి తాత్కాలిక కార్మికులను నియమించుకున్నారని విమర్శించారు. ఉద్యోగ భద్రత కోసం సంస్థ విలీనాన్ని కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు నాగమణి, బీపాషా, అరుణోదయ చరణ్‌, ఆజాద్‌, అన్వర్‌ఖాన్‌, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, కుమార్‌గౌడ్‌, ప్రసాద్‌, బేబీరాణి తదితరులు ఉన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here