తేలని హద్దులు.. వీడని చిక్కులు

0
3


తేలని హద్దులు.. వీడని చిక్కులు

అపరిష్కృతంగా అటవీ-రెవెన్యూ  భూ వివాదాలు

రైతులకు తప్పని నిరీక్షణ

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

బాన్సువాడ మండలం కోనాపూర్‌లో వివాదంలో ఉన్న అటవీ భూమి

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దస్త్రాల శుద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ జిల్లాలో 98 శాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అటవీ -రెవెన్యూ శాఖల మధ్య ‘హద్దు’ పంచాయతీ తేలకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

టవీ భూముల్లో సాగు చేసుకొంటున్న రైతులు పాసు పుస్తకాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రక్షిత అటవీ ప్రాంతాన్ని సూచించే హద్దులు లేకపోవడం.. అసైన్డ్‌ పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ శాఖ పట్టా హద్దులు చూపకపోవడం ఈ సమస్యకు కారణమైంది. ఇరు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పేద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టాలు చెల్లవని, భూములు తమవని అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధారి, బిచ్కుంద, రాజంపేట, సదాశివనగర్‌, లింగంపేట, ఎల్లారెడ్డి, జుక్కల్‌ ,నాగిరెడ్డిపేట మండలాల్లో అటవీ భూముల సమస్య ఎక్కువగా ఉంది.

ఇతర భూముల నవీకరణ తుది అంకానికి

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహా మిగిలిన వాటికి సంబంధించిన దస్త్రాల ప్రక్రియ 98 శాతం మేరకు పూర్తి అయ్యింది. మిగిలిన దస్త్రాలు నవీకరణ చేసే దిశగా రెవెన్యూ అధికారులు కార్యాచరణను రూపొందించారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న భూముల సమస్యలతో పాటు మండల కేంద్రాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూములకు పట్టాల మంజూరీ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.

సవరణలకు మార్గం సుగమం

ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక కారణాల వల్ల పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లాయి.

*● ప్రధానంగా  భూ విస్తీర్ణాల్లో తేడాలొచ్చాయి. పాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణాలు సవరించే అధికారం ఇప్పటి వరకు సంయుక్త పాలనాధికారికి మాత్రమే ఉండేది.

* క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల వినతుల మేరకు సవరణల బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here