త్యాగానికి ప్రతిరూపం…బక్రీద్‌ పండుగ

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అనగా జంతువని, ఈద్‌ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్‌ ఖుర్బాని అని, అరబిక్‌లో ఇదుల్‌ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌ హజ్‌ నెలలో బక్రీద్‌ పండుగవస్తుంది. జిల్‌ హజ్‌ నెల పదో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్‌ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. మక్కాకు వెళ్లే ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి. త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్‌ పండుగలోని ఆంతర్యం. ఖురాన్‌ ప్రకారం.. భూమిపైకి అల్లాహ్‌ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం అలైహి సలాం మక్కా నగరాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లహ ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరుపొందాడు. ఇబ్రహీం అలైహి సలాం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్‌ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్‌ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం అలైహి సలాం కలగన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here