త్రివిక్రమ్ ఏ ఉద్దేశంతో అన్నారో.. పాత రోజులు గుర్తుచేసుకున్న శర్వానంద్

0
3


యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ‘రణరంగం’ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఆదివారం రాత్రి కాకినాడలో ఘనంగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

Also Read: ఆ డేంజర్ ఉండి కూడా ‘ఎవరు’ హిట్టావ్వాలని కోరుకుంటున్నా: నాని

ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ త్రివిక్రమ్‌తో తనకున్న పాత పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నించే సమయంలో త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాణ్ణి. అప్పటికి ఆయన దర్శకుడు కాలేదు. పెద్ద రైటర్‌. ఓ సందర్భంలో ఆయన, నేను కలిసి కారులో వెళ్తున్నప్పుడు ‘ఏదైనా సినిమాలో క్యారెక్టర్‌ ఇవ్వండి సార్‌’ అన్నాను. ‘నీతో చేస్తే కచ్చితంగా హీరోగానే చేస్తా. క్యారెక్టర్‌ అయితే ఎప్పటికీ ఇవ్వను’ అని అన్నారు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో.. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని శర్వానంద్ అన్నారు.

‘రణరంగం’ సినిమా షూటింగ్‌ను కొన్నిరోజులపాటు కాకినాడలో చేశామని, ఇక్కడే ట్రైలర్‌‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని శర్వా వెల్లడించారు. ‘‘ఈ రోజు మర్చిపోలేని రోజు. ఉదయం విమానాశ్రయంలో పవన్‌ కల్యాణ్‌గారిని కలిశాను. పరిశ్రమకు రాకముందు పవన్‌ గారి షూటింగులకు వెళ్లేవాణ్ణి. అది గుర్తుపెట్టుకుని ‘శర్వా ఎలా ఉన్నావ్‌?’ అని అడిగారు. సినిమా గురించిన విశేషాలు పంచుకున్నాను. ‘రణరంగం’ ఈనెల 15న థియేటర్లలోకి వస్తోంది. ఆదరించండి’’ అని శర్వా ముగించారు.

Also Read: ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను.. ‘ఆదిత్య 369’ చూశాను: త్రివిక్రమ్

ఇప్పటి వరకు సుధీర్ వర్మ సినిమాలంటే గన్స్, బ్లడ్ మాత్రమే కనిపిస్తాయని.. ఈ సినిమా చూశాక ఆయన క్యూట్ లవ్ స్టోరీలు కూడా తీయగలని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ అన్నారు. తాను వేదికపై ఏం మాట్లాడాలని అనుకున్నానో అది ట్రైలర్‌లో చెప్పేశానని దర్శకుడు సుధీర్ వర్మ అన్నారు. శర్వానంద్‌తో రెండేళ్లు కలిసి పనిచేశానని, తొలి రోజు తాను ఎంత ఎనర్జీతో ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని వెల్లడించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here