త్వరలోనే ఒకే వాట్సాప్ అకౌంట్ తో ముల్టీపుల్ ప్లాట్ ఫామ్స్ మరియు డివైస్ లో పని చేయనున్న వాట్సాప్

0
7


సోషల్ మీడియా లో వాట్సాప్ కి చాలా క్రేజ్ ఉంది. మనలో చాలా మంది ఒకే వాట్సాప్ అకౌంట్ తో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మొబైల్స్ లేదా టాబ్లెట్స్ లో వాడాలి అనుకుంటాం. కానీ అది సాధ్యపడదు.

ప్రస్తుతం ఒకేసారి పర్సనల్ కంప్యూటర్ మరియు మొబైల్ లో ఒకేసారి వాట్సాప్ ను వాడవచ్చు. ఇది వాట్సాప్ వెబ్ అనే ఫీచర్ ద్వారా కుదురుతుందని మనందరికీ తెలుసు. అయితే ఈ ఫీచర్ లో రెండు ఒకేసారి కనెక్ట్ అయివుండాలి. అయితే ఇంకా ఈ అవసరం ఉండదు.

WAబీటా ఇన్ఫో ట్విట్టర్ అకౌంట్ నుండి వస్తున్నా సమాచారం ప్రకారం త్వరలోనే ఒకే వాట్సాప్ అకౌంట్ తో ముల్టీపుల్ ప్లాట్ ఫామ్స్ మరియు పలు డివైస్ లో ఒకేసారి వాట్సాప్ ను వాడుకోవచ్చు. అలాగే ఈ రకంగా వాడేటప్పుడు మన మొబైల్ లో వాట్సాప్ కనెక్షన్ లేకపోయినా కూడా వాడుకోవచ్చు. అంటే ఒక వాట్సాప్ అకౌంట్ తో విండోస్ ,మొబైల్ , ఐ ఓస్ ల్లో ఒకేసారి వాడుకోవచ్చు. అయితే చాలా రోజులనుంచి ఈ ఫీచర్ ఒక రూమర్ అని ఊహాగానాలు వినిపించాయి వాటిని పటాపంచల్ చేస్తూ WAబీటా ఇన్ఫో ట్విట్టర్ లో ఒక ట్విట్ కూడా చేసింది. ఈ ఫీచర్ ద్వారా కొన్ని సెక్యూరిటీ పరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. చూద్దాం వాట్సాప్ ఏ రకంగా జాగర్తలు తీసుకుని ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుందో.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here