త్వరలో రెండో విడత జీవాల పంపిణీ

0
3


త్వరలో రెండో విడత జీవాల పంపిణీ

వెల్మల్‌, న్యూస్‌టుడే: జిల్లాలో రెండో విడత రాయితీ గొర్రెల పంపిణీ త్వరలో చేపట్టనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బాలిక్‌ అహ్మద్‌ తెలిపారు. వెల్మల్‌లో శుక్రవారం పశువులకు దాణా పంపిణీ, గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. డీడీలు చెల్లించిన వారందరికి ఇస్తామని, ఈ నెలాఖరు వరకు ప్రక్రియ మొదలుపెడతామని వివరించారు. రాయితీ కింద ఇచ్చిన జీవాలు ఇప్పటి వరకు అయిదు వేల వరకు చనిపోయాయని, వాటి స్థానంలో కొత్తవి ఇచ్చినట్లు చెప్పారు. బీమా చేయించిన జీవాలు ప్రమాదవశాత్తు చనిపోతే పరిహారం అందే వీలుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏటేటా పశుసంతతి పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు. గ్రామంలో రాయితీ కింద మంజూరైన 48 యూనిట్లకు సంబంధించి 206 కిలోల చొప్పున దాణా పంపిణీ చేశారు. 1080 పశువులకు గాలి కుంటు నివారణ టీకాలను వేశారు. ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, జడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున, సర్పంచి మచ్చర్ల సాయమ్మ, ఉప సర్పంచి ముప్పెడ నారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు మీనా, సీనియర్‌ నాయకుడు దంసన్న, రాజన్న, సురేశ్‌, ముత్యం, మండల పశువైద్యాధికారి హన్మంత్‌రెడ్డి, మౌలానా పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here