త్వరలో వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ను మొదలుపెట్టనున్న ఫ్లిప్ కార్ట్

0
1


ఇండియా లో ఆన్లైన్ షాపింగ్ లో ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లదే అత్యధిక వాటా. 2016లో ఆన్ లైన్ తో వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ను మొదలు పెట్టి లగే కొన్ని నెలల క్రితం మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సేవలు అన్ని ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా అందించబడుతున్నాయి.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ కూడా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సేవలోకి రానున్నట్లు తెలుస్తుంది. మనీ కంట్రోల్ మరియు XDA డెవలపర్ నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం ఈ సేవలను ఫ్లిప్ కార్ట్ ఉచితంగా అందించనున్నది. అలాగే ఈ సేవల కోసం ఫ్లిప్ కార్ట్ వాల్ట్ డిస్నీ మరియు ఆల్ట్ బాలాజీ లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే ఈ సేవలు ఉచితంగానే అందించబడుతున్న కానీ కస్టమర్ ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ మెంబర్ అయి ఉండాలి.

ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్షిప్ పొందడానికి మనం ఖర్చు చేయాలిసిన అవసరం లేదు. 12నెలల కాలం లో 300సూపర్ కాయిన్స్ పొందినా ప్రతి కస్టమర్ ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్షిప్ పొందవచ్చు. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్షిప్ లో యు ట్యూబ్ ప్రీమియం,గానా,ఓయో, హాట్ స్టార్, జొమాటో,సోనీ లైవ్, హంగామా వంటి ఎన్నో ప్రీమియం సర్వీసెస్ ను సూపర్ కాయిన్స్ ద్వారా అందిస్తుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here