దక్షిణాఫ్రికాతో వన్డే సిరిస్: టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ!

0
3


హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరిస్‌కు ముందు భారత మహిళల జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన బొటన వేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌‌కు దూరమైంది. 23 ఏళ్ల స్మృతి మంధాన ఆదివారం నెట్ ప్రాక్టీస్‌ చేస్తోన్న సమయంలో బొటన వేలికి గాయమైంది.

అనంతరం మంధానకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో సఫారీ పర్యటన నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ఆల్‌ రౌండర్‌ పూజా వస్త్రాకర్‌‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. హెడ్ కోచ్ డబ్ల్యువి రామన్ మాట్లాడుతూ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిజియోస్‌ అంచనా ఆధారంగా మంధాన తిరిగి జట్టులో ఎప్పుడు చేరుతుందో తెలుస్తుందని అన్నారు.

IND vs SA: విశాఖ ఎయిర్‌పోర్టులో తడిచిన భారత ఆటగాళ్లు.. అసహనం వ్యక్తం చేసిన రోహిత్!!

“ఇది తేలికపాటి పగులు. ఆమెకు ఇంకా MRI పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున టైమ్‌లైన్‌ను చెప్పడం కష్టం. కొంత వాపు కూడా ఉంది” అని డబ్ల్యువి రామన్ అన్నారు. కాగా, గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దక్షిణాప్రికాతో మూడు వన్డేల సిరీస్‌ బుధవారం ప్రారంభమైంది.

India vs South Africa: ఒకే తరహాలో వికెట్‌ సమర్పించుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే భారత బౌలర్లు సఫారీలకు షాకిచ్చారు. తొలి ఓవర్‌ తొలి బంతికే గోస్వామి బౌలింగ్‌లో లిజాలే లీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. ఆ తర్వాత ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లతో విజృంభించడంతో 56 పరుగులకే మూడు కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here