దట్టమైన మబ్బులను చీల్చుకుంటూ విమానం ఎంట్రీ.. కళ్లు చెదిరే దృశ్యం!

0
0


కాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములతో కుండపోతగా కురిసేందుకు సిద్ధంగా ఉన్న ఆ మబ్బుల నుంచి అకస్మాత్తుగా ఓ భారీ రూపం బయటకు వచ్చింది. పాతాళ భైరవీలో మాంత్రికుడి మాయలా, హాలీవుడ్ సినిమాలో సన్నివేశంలా ఓ పేద్ద విమానం మబ్బులను చీల్చుకుంటూ ప్రత్యక్షమైంది. సేఫ్‌గా ల్యాండైంది.

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఇప్పుడు మీరు గొప్ప ఎంట్రీ సీన్ చూడబోతున్నారు’’ అంటూ చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 2.76 లక్షల మంది వీక్షించారు. 3 వేల మంది వరకు రిట్వీట్ చేసుకున్నారు. ఎమిరేట్స్ A-380 విమానం అకస్మాత్తుగా మబ్బుల్లో ప్రత్యక్షం కావడం నెటిజనులకు భలే నచ్చేసింది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ట్వీట్‌పై ఎవరెవరు ఏమంటున్నారో చూడండి.

వీడియో:

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here