దత్తతపై దయ చూపండి

0
2


దత్తతపై దయ చూపండి

మంజూరులున్నా.. పనులు సున్నా 

సీడీపీ నిధులపై నిర్లక్ష్యం

శాసనసభ్యులు పట్టుబడితేనే ముందుకు

న్యూస్‌టుడే, వెల్మల్‌

నందిపేట్‌ మండలం కేంద్రంలో అధ్వానంగా తయారైన ప్రధాన రహదారి

‘దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించలేదన్న..’ చందంగా తయారైంది సీడీపీ నిధుల పరిస్థితి. పల్లె ప్రగతి కోసం గ్రామజ్యోతి ద్వారా ప్రజాప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. దండిగా నిధులను తెచ్చిన నేతలు వాటిని పరుగులు పెట్టించడంలో వెనుకడుగు వేస్తున్నారు. వరుసగా వచ్చిన ఎన్నికలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మళ్లీ వేగం పుంజుకొని అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలంటే సంబంధిత ఎమ్మెల్యేలే పట్టుబట్టాలి. దత్తత పల్లెలపై దయ చూపాలి.

2015లో సర్కారు గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టింది. శాసనసభ్యులు మండలానికి ఒకటి చొప్పున జిల్లాలో 18 పల్లెలను దత్తత తీసుకున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.3.35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన గ్రామజ్యోతి కమిటీలు నామమాత్రమే అయ్యాయి. నిధులు తెచ్చి, టెండర్లు వేయించిన ప్రజాప్రతినిధులు పనులను పరుగులు పెట్టించడంలో చొరవ తీసుకోవాలి. గతంలో మాదిరి పల్లెనిద్రలు, పర్యటనలు చేస్తేనే ప్రగతిలో కదలిక వస్తుంది.

తొర్లి కొండలో వృధా గా మినీ నీటి ట్యాంకు

 

సమస్యలతో సహవాసం..

వర్షాకాలం కావడంతో ఏ ఊరు వెళ్లినా రహదారులన్నీ గుంతలమయంగా దర్శనం ఇస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేనంతగా నరకప్రాయంగా మారాయి. ఇక కాల్వలు లేక మురుగు రోడ్లపైకి వస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యుల దత్తతతో గ్రామ స్వరూపం మారేలా అభివృద్ధి జరగాలి. నిధులు కేటాయించడం వరకే కాదు.. సకాలంలో పూర్తయ్యేలా గుత్తేదారులు, అధికార యంత్రాంగంతో ప్రగతిపై సమీక్షలు జరపాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే నిధులు మురిగిపోతాయి. ప్రగతి కుంటుపడుతుంది. జిల్లాలో ఒకరిద్దరు మాత్రమే పల్లెబాట పడుతున్నారు. మిగతావారు అదే దారి పడితే ప్రగతిబాట వేయొచ్ఛు

అక్కరకు రాని శిక్షణ..

గ్రామజ్యోతి పథకాన్ని అమల్లోకి తెచ్చిన వెంటనే కమిటీలు వేశారు. వీటిని పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారిని మండల మార్పు సారథిఫగా, మండల స్థాయి అధికారిని గ్రామస్థాయి మార్పు అధికారిగా నియమించారు. ఇందులో పంచాయతీ, అంగన్‌వాడీ, ఆరోగ్య తదితర అనుబంధ సిబ్బందితో కలిపి తాగునీరు, పౌష్టికాహారం, విద్య, సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన ఎలా చేయాలనే దానిపై 2017 జులై, ఆగస్టులో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇందుకోసం ఉభయ జిల్లాల్లో రూ.పది లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా అధికార యంత్రాంగం, సిబ్బంది వీటి పనితీరుపై పర్యవేక్షణ మరిచారు. దీంతో సీడీపీ నిధుల వినియోగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here