‘దర్బార్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మహేష్.. ఆయనంటే ఎప్పటికీ గౌరవమే

0
1


సూపర్ స్టార్ రజినీకాంత్‌పై తనకెప్పుడూ ప్రేమ, గౌరవం ఉంటాయని మరో సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దర్బార్’ మోషన్ పోస్టర్‌ను మహేష్‌ బాబు గురువారం విడుదల చేశారు. రజినీకాంత్ గారి ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్విట్టర్‌లో మహేష్ పేర్కొన్నారు. దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్‌తో పాటు మొత్తం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే, ‘దర్బార్’ మోషన్ పోస్టర్ అదిరిపోయింది. పోలీస్ ఆఫీసర్ లుక్‌లో రజినీకాంత్ కెవ్వు కేక అంతే. దీనికి తోడు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో స్థాయిలో ఉంది. మొత్తంగా ఈ ఒక్క పోస్టర్‌తో మంచి హైప్ క్రియేట్ చేయగలిగారు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. రజినీకాంత్, మురుగదాస్ కాంబోలో వస్తోన్న తొలి చిత్రం ఇది. అలాగే రజినీకి ఇది 167వ సినిమా. దాదాపు పాతికేళ్ల తరవాత రజినీకాంత్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుంది. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రజనీకాంత్‌కు జోడీగా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. ఇప్పటి వరకు ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ చిత్రాల్లో రజినీకి జోడిగా నయనతార నటించారు. కాగా, ‘దర్బార్’ తమిళ మోషన్ పోస్టర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ విడుదల చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here