దసరా పండుగ: రైళ్లు కిటకిట, ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధర మూడింతలు

0
3


దసరా పండుగ: రైళ్లు కిటకిట, ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధర మూడింతలు

దసరా పండుగ సందర్భంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ దృష్ట్యా రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్లు భారీగా పెంచారు. ఇప్పటి వరకు ప్లాట్ ఫామ్ టిక్కెట్ రూ.10 ఉండగా, పండుగ సీజన్ నేపథ్యంలో రూ.30కి పెంచారు. గత శనివారం (సెప్టెంబర్ 29) నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఇదే ధర ఉంటుంది.

దసరా సెలవుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్లను తాత్కాలికంగా పెంచుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేతెలిపింది. పండుగ సీజన్ కావడం వల్ల రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతాయని, ప్లాట్ పామ్ టిక్కెట్ల ధరలు పెంచడంవల్ల రద్దీని కొద్దిమేర నియంత్రించవచ్చునని భావిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీ తర్వాత నుంచి మళ్లీ పాత రేట్లు అమలు చేస్తారు.

పెంచిన టికెట్ ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమలవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచుతున్నారు. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులు, స్నేహితుల రద్దీని నివారించడంలో ఆదాయం పెంచుకోవడానికి ఏటా టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా పెంచుతోంది. గతంలో రూ. 10 నుంచి టికెట్ రూ.20కి పెంచిన రైల్వే శాఖ ఇప్పుడు ఏకంగా రూ.30కి పెంచింది.

కృష్ణా జిల్లాలోని ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇక్కడకు వేలాది భక్తులు వెళ్తుంటారు. అలాగే ఊళ్లకు వెళ్తుంటారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here