దారితప్పిన ప్రతిపాదనలు

0
4


దారితప్పిన ప్రతిపాదనలు

ఛిద్రమైన రోడ్లు

నిధులు కాగితాల్లోనే

ప్రయాణికులకు తప్పని అవస్థలు

ఈనాడు, నిజామాబాద్‌

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో వివిధ పథకాల నిధులతో నిర్మించిన రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. తారు చెదిరి, కంకర తేలింది. రాకపోకలు సాగించలేని విధంగా మారాయి. 10- 15 ఏళ్లుగా నిర్వహణకు నోచుకోనివి అనేకం ఉన్నాయి. ఐదేళ్లకోసారి అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం, నిధుల లేమి నెలకొంది. రోడ్డు వేశాక ఐదేళ్లపాటు గుత్తేదారుడిదే నిర్వహణ బాధ్యత. ఆ తర్వాత సంబంధిత శాఖ చూసుకోవాలి. ఉభయ జిల్లాల్లోని మండల కేంద్రాల రహదారుల్లో అధికంగా ర.భ.శాఖ పరిధిలోనే ఉన్నాయి. మారుమూల గ్రామాలను కలిపేవి, లింకు రోడ్లు పంచాయతీరాజ్‌శాఖ నిర్వహణలో ఉన్నాయి.

నిర్వహణ మరిచి…

ఉభయ జిల్లాల్లో రహదారుల నిర్వహణలో అలసత్వం ప్రస్పుటంగా కనిపిస్తోంది. మండల కేంద్రాల రోడ్లు కుగ్రామాల దారులను తలపిస్తున్నాయి. ఎత్తుపల్లాను పట్టించుకోకుండా.. నీళ్లకంటే పల్చగా తారు.. మంత్రోదకంలా సిమెంటు చిలకరించి ప్రమాణాలకు తూట్లు పొడిచారు. నిర్మాణ సమయంలో ఇంజినీర్లు, పరిశీలించాల్సిన అధికారులు అటుగా చూసిన దాఖలాలుండవు. ఫలితంగా అనతికాలంలోనే వాటికి కాలం చెల్లుతోంది. 2014- 15 కాలంలో రూపుదిద్దుకున్న రోడ్లన్నీ ప్రస్తుతం గుత్తేదారు నుంచి సంబంధిత శాఖ పరిధిలోకి వచ్చేశాయి. వాటి పరిస్థితి నేడు అధ్వాన స్థితికి చేరాయి. తప్పనిసరిగా మరమ్మతులు అవసరం. కొన్నిచోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయి.

ప్రతిపాదనలు వెళ్లాయి ఇలా..

రెండు జిల్లాల నుంచి నిర్మించి ఐదేళ్లు పూర్తయిన వాటి అభివృద్ధి కోసం మరోమారు ప్రతిపాదనలు చేశారు. వాటిల్లో 2003- 04 నుంచి 2010లో అభివృద్ధి చేసి వదిలేసినవి కొన్ని, పదేళ్ల కిందట చేసిన మరికొన్ని, గుత్తేదారు నుంచి ర.భ., పంచాయతీరాజ్‌శాఖలకు అప్పంచినవి ఉన్నాయి. రెండు శాఖల నుంచి పటిష్ఠపర్చటం, తారు పోయటం వంటి పనులకు నిధుల అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. ర.భ.లో పునర్నిర్మాణం, గుంతలు పూడ్చే తాత్కాలిక పనుల కోసం కూడా ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.


మంత్రి గారే ‘దారి’కి తీసుకురావాలి

రహదారులు.. భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఇందూరు జిల్లా వాసే.. ఈ నేపథ్యంలోనే రోడ్ల అభివృద్ధిపై ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకొన్నారు. వరుస ఎన్నికల నేపథ్యంలో పాలనాపరమైన నిర్ణయాలు, నిధుల మంజూరులో ఆలస్యమైంది. జిల్లా మంత్రిగా ఇప్పుడు చొరవ చూపితే అధ్వాన రోడ్లు అభివృద్ధికి నోచుకుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజల అవస్థలు తొలగుతాయి.


ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖకు చెందిన 127 రోడ్లు.. 264.40 కి.మీ. మేర, ర.భ.శాఖవి 103 రోడ్లు.. 477.58 కి.మీ. మేర మరమ్మతు చేయాల్సి ఉంది. మొత్తం 230 రోడ్లు.. 741.98 కి.మీ. బాగు చేయాల్సి ఉంది. జిల్లా రహదారుల పరిస్థితి ఎలా ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రాల్లోని రహదారులు కుగ్రామాలను తలపిస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here