దిగివచ్చిన చైనా, మానస సరోవర్ యాత్రికులకు వీసాలు మంజూరు..

0
2


దిగివచ్చిన చైనా, మానస సరోవర్ యాత్రికులకు వీసాలు మంజూరు..

ట్టకేలకు చైనా మానస సరోవర్ యాత్రికులకు వీసాలను జారీ చేసింది. నేడు అన్ని పత్రాలు ఉన్న యాత్రికులకు మధ్యహ్నాం అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజులుగా ఢిల్లిలో వీసాల కోసం వేచి చూస్తున్న యాత్రికులు ఢిల్లీ వీడి మానస సరోవర్ యాత్రకు బయలు దేరారు.జమ్ముకశ్మీర్‌‌ విభజనతో పాటు లద్దాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం పట్ల ఆచితూచి స్పందించిన పొరుగు దేశం చైనా, తన వ్యతిరేకతను ప్రకటించిన కోద్ది గంటల్లోనే దిగివచ్చింది.

కశ్మీర్ పరిణామాలతో వీసాలను ఆపిన చైనా

ఈ నేపథ్యంలోనే మానసరోవర్‌ యాత్ర కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులకు వీసా జారీలో ఆలస్యం చేసింది. రెండు భారతీయ బృందాలకు మంగళవారం నాటికే మంజూరు చేయాల్సి ఉండగా.. మధ్యహ్నాం వరకు వారికి వీసాలు అందలేదు. సాధారణంగా యాత్రకు వెళ్లే ముందు రోజు ఉదయం చైనా వీసాలు ఇస్తుంది. కానీ ఈసారి అలా జరగకపోవడంతో.. స్వస్థలాల నుంచి బయలుదేరిన యాత్రికులు దిల్లీలోనే రెండు రోజులుగా ఆగిపోయారు. వాస్తవానికి వారు బుధవారం ఉదయమే బస్సుమార్గంలో టిబెట్‌ చేరుకోవాల్సి ఉంది.

జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకించిన చైనా

జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకించిన చైనా

ఇక జమ్ము కశ్మీర్‌ విభజనపై స్పందించిన చైనా లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా భూభాగాన్ని భారత్ తన పరిపాలన పరిధిలో కలుపుకోవడాన్ని చైనా ఎప్పుడు వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. భారత్ దేశం తన దేశ చట్టాలను సవరించి చైనా బౌగోలిక సార్వబౌమత్వాన్ని నిర్లక్ష్యం చేయడం తాము ఒప్పుకోమని తెలిపారు.

 చైనా ప్రకటనపై ఘాటుగా స్పందించిన భారత్

చైనా ప్రకటనపై ఘాటుగా స్పందించిన భారత్

అయితే చైనా ప్రకటనపై వెంటనే భారత్ స్పందించి, ఘాటుగా సమాధానం చెప్పింది. చైనా ప్రకటనను తిప్పికొడుతూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని ఇందులో ఇతర దేశాల జోక్యాన్ని సహించమని పేర్కోన్నారు. భారత్ సైతం ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చదని ,తమ సమస్యల్లో కూడ విదేశాలు కూడ ఇదే పద్దతి పాటించాలని కోరుకుంటుందని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here