దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిల్స్‌ పంపిణీ

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రైసైకిల్స్‌ అందజేయడానికి కషి చేద్దామని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ తెలిపారు. మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని నాగారం క్రీడల స్టేడియంలో ఏ.డి.ఐ.పి. పథకం కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిల్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసిస్టెన్స్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ పర్సన్స్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25 వేల రూపాయల సబ్సిడీ అంద చేసిందని, మరో రూ.12 వేలు ఎంపీ అభివద్ధి నిధుల కింద గత సంవత్సరం మంజూరు చేయడం జరిగిందని, ఇందుకై 2018లో సదరం శిబిరాలు నిర్వహించి 471 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరిలో ప్రస్తుతం 353 మందికి బ్యాటరీతో కూడిన ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద అర్హులకు శాసనసభ సభ్యులు లేదా పార్లమెంటు సభ్యుల నిధుల నుండి రూ. 12 వేలు మంజూరు చేస్తే మరో రూ. 25 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, తద్వారా దివ్యాంగులకు వాహనాలను సమకూర్చవచ్చన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే శాసన సభ్యులు కానీ ఎంపీకి గాని దరఖాస్తు చేసుకోవాలని ఎన్ని దరఖాస్తులు వచ్చినా కూడా అర్హులు ఉంటే నిబంధనల మేరకు వాహనాలు సమకూర్చడానికి అవకాశముందని, వీరిని ప్రోత్సహించడానికి అందరం కషి చేద్దామని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here