దీపిక పదుకొనె చిన్నప్పటి ప్రోగ్రస్ రిపోర్టు చూశారా?

0
2


దీపిక పదుకొనె చిన్నప్పటి ప్రోగ్రస్ రిపోర్టు చూశారా?

ఇంటర్నెట్ డెస్క్‌:  బాలీవుడ్తో పాటు దక్షణాది ప్రేక్షకులకు కూడా కలలరాణి అయిన దీపిక పదుకొనె తన చిన్నప్పటి ప్రోగ్రస్ రిపోర్టులను నెట్టింట్లో ఉంచింది. దీపిక, తన చిన్ననాటి జ్ఞాపకాలలోకి ప్రయాణించి తనతోపాటు కొన్ని ముచ్చట్లను ఇన్‌ స్టాగ్రాంలో పంచుకుంది. వాటిలో తన స్కూలు రిపోర్టు కార్డులను, టీచర్ల కామెంట్లను కూడా మనం చూడవచ్చు. 

ఒక ఉపాధ్యాయని ‘దీపిక ఒట్టి వాగుడుకాయ’అని అంటే, దానికి భర్ల రణ్‌వీర్ సింగ్‌ కూడా ఆమె ‘ట్రబుల్ మేకర్’అని గొంతుకలిపాడు. మరో హాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా వంతపాడుతూ, ఆమెను ‘తింగరిది’ అంటూ ఆటపట్టించాడు.

రెండో రిపోర్టు కార్డులో టీచర్ ‘దీపికా, నువ్వు చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి’ అంటూ మందలించినట్లు ఉంది. రణ్‌వీర్ సింగ్‌ ‘సరే టీచర్, అలాగే’ అని కొంటెగా జవాబిచ్చాడు.

ఇక ఆఖరిదైన మూడవదానిలో ఆమె టీచర్, దీపిక కలల్లో విహరిస్తూ ఉంటుందని వ్యాఖ్యానిస్తే, రణ్‌వీర్ తన జవాబుగా మబ్బులు, హృదయాకార ఎమొజీలను జత చేశాడు.

ఇక ఈ ప్రహసనానికి మురిసిపోయిన సోషల్ మీడియా పక్షులు, ఆ మూడు పోస్టులకు వరుసగా 12 లక్షలు, 6 లక్షలు, 6 లక్షలకు పైగా లైకులతో తమ అభిమానాన్ని కురిపించారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here