దుబాయ్‌లో మగ్గుతున్న గొల్లపల్లి మధును రప్పించాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి మధు అనే యువకుడు లైసెన్సులు ఏజెంట్ల చేత మోసానికి గురై దుబాయి దేశంలో దిక్కుతోచకుండా ఉన్న బాధితున్ని తక్షణం గ్రామానికి తీసుకొచ్చే విధంగా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, విదేశీ మంత్రిత్వశాఖ ప్రజాప్రతినిధులు ఇతని విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ఎంసిపిఐ పార్టీ డిమాండ్‌ చేస్తుందని జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొల్లపల్లికి చెందిన రెడ్డి పెద్ద బీరయ్య బాలమణిల కుమారుడైన మధు లైసెన్సులేని ఏజెంటు కేసర్‌ ట్రావెల్స్‌ నుండి కంపెనీ వీసా ఉందని అతని నమ్మించి దుబాయ్‌ దేశానికి పంపిన తర్వాత కంపెనీ వీసా లేకపోగా అప్పులు తీర్చే ఉద్దేశంతో దొంగచాటుగా ఆరు నెలల పాటు దొంగతనంగా పనులు చేసుకుని గత మూడు నెలల నుండి కనీసం తిండి కూడా లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అతన్ని దుబాయ్‌ లో ఉన్నటువంటి కొందరు యువకులు తమ రూముల్లో తలదాచుకునేందుకు అవకాశం ఇచ్చారని, అతను తిరిగి దేశానికి రావడానికి దుబాయ్‌ దేశానికి చెందిన నాలుగువేల ధరంలు కడితేనే ఇండియాకు పంపిస్తామని అక్కడి ఏజెంటు తెలిపాడన్నారు. మధును తక్షణమే మనదేశానికి రప్పించేందుకు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here