దూప తీర్చుతున్న అలీసాగర్‌

0
1


దూప తీర్చుతున్న అలీసాగర్‌

ఆగస్టు వరకు రక్షిత నీటి సరఫరా
1294.3 అడుగులనీటి మట్టం
న్యూస్‌టుడే, ఎడపల్లి

నిజామాబాద్‌ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి. అలీసాగర్‌ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నిజాంసాగర్‌ జలాశయం నుంచి నీటిని మళ్లించారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1299.5 అడుగులు కాగా ప్రస్తుతం 1294.3 అడుగుల నీరు ఉంది. నగర అవసరాల కోసం నిత్యం ఒక ఎంసీఎఫ్‌టీ చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇలా ఆగస్టు నెలాఖరు వరకు అందించే అవకాశం ఉంది.
1287 నుంచి 1294 అడుగులకు
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మేలో అలీసాగర్‌లో నీటి నిల్వ తగ్గుముఖం పట్టింది. 1287 అడుగులకు పడిపోవడంతో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తుతుందని అధికారులు భావించారు. నిజాంసాగర్‌ నీటితో అలీసాగర్‌ నింపారు. దీంతో నీటి నిల్వ 1294 అడుగులకు చేరుకొంది.
 సగం నిల్వలే..
వర్షాలు పడితేనే అలీసాగర్‌ జలాశయం జలకళను సంతరించుకోనుంది. ప్రస్తుతం సగం వరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఇందులో 30 శాతం వాడుకోలేని పరిస్థితి. కిందిభాగంలో బురద ఉండటం వల్ల నీరు పంపులకు అందే వీలుండదు.
పొదుపుతో కరవును ఎదుర్కోవచ్చు
– పావని, డీఈ, నీటిపారుదల శాఖ, నిజామాబాద్‌
నిజామాబాద్‌ నగర ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. సీజన్‌ ప్రారంభమైనా వర్షాలు పడటం లేదు. వానలు కురిస్తేనే తాగునీటి ఇబ్బందులు ఉండవు. నీటి పొదుపుతో కరవు పరిస్థితులను ఎదుర్కోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here