దేవుడు చిన్నచూపు చూశాడు.. వేణుమాధవ్ మృతిపై చిరంజీవి

0
2


ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. వేణుమాధవ్ అకాల మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 51 ఏళ్లు. వేణుమాధవ్ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

Also Read: వేణుమాధవ్ సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు: పవన్ కళ్యాణ్

ముందుగా పవన్ కళ్యాణ్ తన సంతాప లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ తరవాత చిరంజీవి ఒక ప్రటకనను మీడియాకు ఇచ్చారు. ‘‘వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి ‘మాస్టర్’ సినిమాలో న‌టించాడు. అటుపై ప‌లు సినిమాల్లో న‌టించి హాస్యన‌టుడిగా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కొన్ని పాత్రలు త‌న‌కోసమే పుట్టాయ‌న్నంతగా న‌టించేవాడు. ఆ పాత్రకే వ‌న్నే తీసుకొచ్చేవాడు. వ‌య‌సులో చిన్న వాడు. సినీ ప‌రిశ్రమ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్యత్ ఉంద‌ని అనుకునే వాడిని. కానీ, దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూర‌ల‌ని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Also Read: నాలుగేళ్లకే మిమిక్రీ.. టీడీపీ ఆఫీసులో ఫోన్ ఆపరేటర్.. 400కు పైగా సినిమాలు

కాగా.. శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ యశోద హాస్పిటల్‌కు వెళ్లి వేణుమాధవ్ మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేణుమాధవ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన ఇంటి వద్ద సాయంత్రం 5 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతామన్నారు. ఆ తరవాత ఫిల్మ్ ఛాంబర్ వద్ద నివాళులర్పించడానికి రేపు మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు ఉంచుతామని చెప్పారు. సాయంత్రం మౌలాలిలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here