దేశం కోసం జీవితాన్ని దారబోసిన మహనీయుడు

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీన్‌ దయాళ్‌ జన సంఘ్‌ స్థాపకుల్లో ఒకరని, తన జీవితాన్ని దేశం కోసం దారబోశారని, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉండి జాతి, జాతీయత, భారతీయ సంస్కతి, ధర్మం మొదలైన విషయాలలో స్పష్టమైన వైఖరి కలిగి ఉండి ఎంతో మందికి మార్గ నిర్దేశకులుగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బుధవారం పండిట్‌ దిన్‌ దయాళ్‌ జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరిస్తున్న, ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి, భారతీయ సంస్కతి సభ్యులతో, జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలని సంకల్పించారన్నారు. ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ పరమ పూజనీయ గురూజీ కోరిక ప్రకారంగా పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ జీ, జగన్నాధరావు జీ, సుందర్‌ సింగ్‌ భాండారి లాంటి మరికొందరు యువకులు కలిసి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబరు 21న జనసంఘ్‌ పార్టీని స్థాపించారన్నారు. ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌ జీ ఎన్నికయ్యారని గుర్తుచేశారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్ఠపరచిన ఘనత దీనదయాళ్‌జీకి దక్కుతుందని రమణారెడ్డి వివరించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here