దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు మరువలేనివి

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయములో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 75 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను జ్ఞాపకం చేసుకొన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కుని కల్పించి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమములో కారంగుల అశోక్‌ రెడ్డి, చాట్ల రాజేశ్వర్‌, మాజీ ఎంపీపీ పండ్ల రాజు, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోయల్కర్‌ కన్నయ్య, లక్కపతి గంగాధర్‌, మాజీ కౌన్సిలర్‌లు కైలాస్‌ లక్ష్మణ్‌, బట్టు మోహన్‌, అంజద్‌, జొన్నల నర్సింములు, గొనె శ్రీనివాస్‌, చిట్మెల్‌ విష్ణు, పిల్లి మల్లేష్‌, చింతల శ్రీనివాస్‌, పంపరి లక్ష్మన్‌, సర్వర్‌, ఎజాజ్‌, గందె శ్రీనివాస్‌, సిరాజ్‌, నాని, ముధామ్‌ రమేష్‌, భరత్‌, కష్ణ, నల్లమడుగు షరీఫ్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here