దోమకొండలో భారీ వర్షం

0
3


దోమకొండలో భారీ వర్షం

ఇళ్లల్లోకి చేరిన నీరు..

పడక గదిలో వర్షపు నీరు

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండలో ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా వచ్చిన వర్షం అతలాకుతలం చేసింది. ఏక ధాటిగా గంట పాటు కురిసిన వర్షం కారణంగా గ్రామంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుమ్మరివాడ, ఊరడమ్మ వీధి, చాకలివాడ, బీబీపేట రోడ్డు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు భయంతో వంట పాత్రలు, ఇతర వస్తువులు చేతపట్టుకుని బయటకు చేరారు. ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోయడానికి ఆయా కుటుంబాల వారు గంటల తరబడి కష్టపడ్డారు. ఊరడమ్మ వీధిలోని కందకం పొంగిపొర్లడంతో పదుల సంఖ్యలో కుటుంబాలు కన్నీళ్లపర్యంతమయ్యాయి. శివరామ మందిరం కోనేరు వర్షపు నీరుతో నిండియింది. మార్కండేయ మందిరం ప్రహరీని తవ్వేసి, నీటిని బయటకు పంపించారు. దేవుని కుంట నిండి ప్రవహించడంతో చేపపిల్లలు రోడ్ల వెంబడి సందడి చేశాయి. జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్‌, ఉప సర్పంచి గజవాడ శ్రీకాంత్‌, నల్లపు శ్రీనివాస్‌, వార్డు సభ్యుడు చింతల జనార్దన్‌, బుర్రి రవికుమార్‌, చింతల రాజేశ్‌ ప్రాంతాలను పరిశీలించారు. నీరు చేరిన ప్రాంతాల్లో పంచాయతీ పాలకులు జేసీబీతో తాత్కాలిక చర్యలు చేపట్టారు.


దోమకొండ: గుడిసెలోకి నీరు రావడంతో గ్యాస్‌బండతో బయటకు వెళ్తున్న కుటుంబీకులు ..

కుమ్మరివాడలో …

ఊరడమ్మ వీధిలో …

బీబీపేట్‌ రోడ్డులోని గృహాల్లో ప్రజల అవస్థలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here