ద్యావుడా.. బంగీ జంప్ చేస్తుండగా తెగిన తాడు, 100 మీటర్ల ఎత్తు నుంచి పడటంతో..

0
0


బంగీ జంప్.. ఎంత థ్రిల్ ఇస్తుందో అంతే రిస్క్ కూడా. ఎత్తైన ప్రాంతాల నుంచి అమాంతంగా కిందికి దూకేసే ఈ సాహసం అటూ ఇటూ అయితే నేరుగా పైకి పోతారు. ఈ విషయం తెలిసి కూడా చాలామంది తమ ప్రాణాలకు తెగిస్తుంటారు. పోలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. 200 మీటర్ల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. నేరుగా కిందపడ్డాడు.

గ్డినియాలోని ర్యాడీ యూరోఫియా థీమ్ పార్క్‌లో ‘ది బంగీ క్లబ్’ సంస్థ భారీ క్రేన్‌తో 200 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బంగీ జంప్‌కు 39 ఏళ్ల వ్యక్తి సిద్ధమయ్యాడు. పైకి వెళ్లిన తర్వాత కాళ్లకు తాళ్లు కట్టుకుని దూకాడు. అయితే, అతడి కాలికి కట్టిన తాడు బకిల్ ఊడిపోవడంతో 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. అయితే, కింద పెద్ద బెలూన్‌ను ఏర్పాటు చేయడంతో దానిపై పడి, కిందకి జారిపోయాడు. తల కిందకి ఉండటం వల్ల మెడ ఎముక విరిగింది. ఈ ఘటన తర్వాత వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించి అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ‘ది బంగీ క్లబ్’ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘పోలాండ్‌లో బంగీ జంప్ నిర్వహించే ఏకైక సంస్థ మాదే. గత 19 ఏళ్లులో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు. బంగీ జంప్ చేసేవారు గాయపడకుండా స్కొకొక్రాన్ పిల్లోస్ వాడుతున్నాం’’ అని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here