ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం

0
0


ముంబై: భారత మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌కు ఊరట లభించింది. ద్రవిడ్‌కు ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీవోఏ) మంగళవారం స్పష్టం చేసింది. దీంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా ద్రావిడ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం అయింది. ఇక తుది నిర్ణయం బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ చేతిలో ఉంది.

బుమ్రా ముందస్తు రాఖీ వేడుక.. ఎదుకంటే!!

ద్రవిడ్‌కు నోటీసులు:

ద్రవిడ్‌కు నోటీసులు:

భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను తాజాగా ఎన్‌సీఏ క్రికెట్‌ హెడ్‌గా నియమించారు. మరోవైపు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాని ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ కంపెనీకి ఉపాధ్యక్షునిగా కూడా ఉన్నారు. దీంతో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌.. ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చారు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవు:

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవు:

ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలో భేటీ అయిన సీవోఏ.. పలు కీలక అంశాలపై చర్చించింది. ద్రవిడ్‌కు ఎటువంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ద్రావిడ్‌కు మార్గం సుగమం అయింది. మంగళవారం జరిగిన సీఓఏ సమావేశానికి ముందే డీకే జైన్‌కు ద్రవిడ్‌ తన వివరణ పంపించారు. అయితే ఇండియా సిమెంట్స్‌ సంస్థలోని ఉద్యోగానికి రాజీనామా చేశారో లేదో తెలియరాలేదు. ఎన్‌సీఏ పదవీ కాలం ముగిసే వరకు సుదీర్ఘ సెలవు తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది.

వెస్టిండీస్‌తో మూడో వన్డే.. సిరీస్‌పై భారత్‌ గురి

మేము వివరణ ఇస్తాం:

మేము వివరణ ఇస్తాం:

సీవోఏ సమావేశం అనంతరం లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొగ్డె మాట్లాడుతూ… ‘ద్రవిడ్‌ కేసులో ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవు. ఎన్‌సీఏ చీఫ్‌గా అతని నియామకాన్ని క్లియర్ చేశాం. ఈ విషయంలో మాకు ఎలాంటి వివాదమేమీ కనిపించలేదు. ఒకవేళ బీసీసీఐ ఎథిక్స్ అఫీసర్ జస్టిస్ డీకే జైన్‌ ఏదైనా విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని కనుగొంటే అతనికి మేము వివరణ ఇస్తాం’ అని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here