ద్విచక్రవాహనం ఢీకొని ఒకరి మృతి

0
1


ద్విచక్రవాహనం ఢీకొని ఒకరి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

ముప్కాల్‌(బాల్కొండ): ముప్కాల్‌లో 44వ నంబరు జాతీయ రహదారి బైపాస్‌పై ద్విచక్రవాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి శనివారం సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత కొన్ని రోజులుగా ముప్కాల్‌లో భిక్షాటన చేసేవాడని తెలిపారు. రహదారి దాటుతుండగా ఆర్మూర్‌ వైపు నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/140215.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here