ద్విచక్రవాహనాలు ఢీ : నలుగురికి గాయాలు

0
0


ద్విచక్రవాహనాలు ఢీ : నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఖదీర్‌

ధర్మారెడ్డి(నాగిరెడ్డిపేట), న్యూస్‌టుడే : ధర్మారెడ్డి శివారులో బోధన్‌-హైదరాబాద్‌ రహదారిపై మంగళవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో నలుగురు గాయపడ్డారు. జలాల్‌పూర్‌కు చెందిన మత్తమాల సిద్ధిరాములు, ఎల్లమోల భూపతి గోపాల్‌పేటకు వచ్చి ఇంటికి తిరిగివెళ్తున్నారు. ఎల్లారెడ్డికి చెందిన ఖదీర్‌ తన భార్య ఫాతిమాతో ద్విచక్రవాహనంపై మెదక్‌ వెళ్తున్నారు. రెండు వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదంలో నలుగురు గాయపడగా వారిని 108 వాహనంలో స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫాతిమా, ఖదీర్‌ల పరిస్థితి విషమంగా ఉందని వారి కుటుంబసభ్యులు తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/124568.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here