ధరలు భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం, 8 గం.ల వరకే లిక్కర్ షాప్స్

0
3


ధరలు భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం, 8 గం.ల వరకే లిక్కర్ షాప్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు భారీగా పెరిగాయి. అన్ని రకాల లిక్కర్ పైన పరిమాణాన్ని బట్టి కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.250 వరకు పెంచడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం నేటి నుంచి (అక్టోబర్ 1) 3500 మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. విడతలవారీగా మద్యం లేకుండా చేస్తామని, ఇందులో భాగంగా క్రమంగా ప్రభుత్వం వాటిని తీసుకుంటుందని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది.

భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం

ఇందులో భాగంగా నేటి నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవడంతో పాటు లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. బ్రాండ్స్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల మద్యంపై సీసాల పరిమాణం ఆధారంగా ధరలను పెంచింది. ఖరీదైన మద్యం నుంచి చీప్ మద్యం వరకు పరిమాణం ఆధారంగా ఒకే విధంగా పెంచింది. దీంతో ఎవరైనా అధిక ధరలు వెచ్చించాల్సిన పరిస్థితి.

లిక్కర్ పైన ధర ఎంత పెరిగిందంటే...

లిక్కర్ పైన ధర ఎంత పెరిగిందంటే…

స్వదేశీ, విదేశీ మద్యంపై ధరలను పెంచింది. రెడీ టు డ్రింక్ కింద విక్రయించే 250/275ML అంటే క్వార్టర్ లిక్కర్ పైన రూ.20 పెంచింది. హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్ పైన రూ.80కి పెంచింది.

రూ.20 పెరిగిన బీరు ధర.. చెప్పిందే చేసిన జగన్

రూ.20 పెరిగిన బీరు ధర.. చెప్పిందే చేసిన జగన్

బీరుపై రూ.20, చిన్న బీరుపై రూ.10 పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం నిషేధంలో భాగంగా ధరలు పెంచుతామని జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అదే చేశారు. అయితే పొద్దస్తామనం పని చేసి వచ్చే పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఇప్పటికిప్పుడు హఠాత్తుగా దీనిని మానలేరు. అలాంటి వారికి ఇది భారంగా మారనుంది. రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎక్కువగా చీప్ లిక్కర్ లేదా పెద్దగా ధరలు లేని బ్రాండ్స్ తాగుతారు. వాటిపై కూడా రూ.20 భారం పడుతోంది.

దేనిపై ఎంత పెరిగిందంటే?

దేనిపై ఎంత పెరిగిందంటే?

స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ పైన రూ.40, ఫుల్ పైన రూ.80 పెంచారు. 60 లేదా 90 ఎంఎల్ పరిమాణంలోని స్వదేశీ మద్యంపై రూ.10 పెరిగింది. లీటర్ మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల మద్యం సీసాపై రూ.250 పెరిగింది. 50 లేదా 60 ఎంఎల్ పరిమాణంలోని విదేశీ మద్యంపై రూ.10, లీటర్‌నర నుంచి రెండు లీటర్ల మద్యంపై రూ.250 పెంచారు. చిన్న, హాఫ్ బీర్లపై రూ.10, పెద్ద బీరుపై రూ.20 పెరిగింది.

పది శాతం లాభం ఇలా...

పది శాతం లాభం ఇలా…

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చిన 10% లాభాన్ని ఇక నుంచి ఎక్సైజ్‌కు 6%, ఏపీబీసీఎల్‌కు 4% ఇవ్వనుంది. కొత్తగా పెంచిన ధరలకు అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ARET) అని ప్రభుత్వం పేరు పెట్టింది.

సేల్స్ టైమింగ్స్

సేల్స్ టైమింగ్స్

మంగళవారం నుంచి మద్యం విక్రయాల సమయాన్ని కుదించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. తొలుత ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరవాలని భావించారు. కానీ వాటిని సవరించారు. ప్రస్తుతం 4380 లిక్కర్ షాప్స్ ఉండగా మంగళవారం నుంచి 3500 దుకాణాలు మాత్రమే నడుపుతున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు మద్యం విక్రయాలు 15 శాతం తగ్గించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here