'ధరలు 50 శాతం తగ్గొచ్చు.. కానీ చేతిలో డబ్బులేవి'

0
5


‘ధరలు 50 శాతం తగ్గొచ్చు.. కానీ చేతిలో డబ్బులేవి’

ఢిల్లీ: ఆటో సేల్స్ నుంచి ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ వరకు ఇటీవల భారీగా పడిపోయాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు వివిధ రకాల ఉద్దీపనలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. దీంతో ఆటో సేల్స్, ఎఫ్ఎంసీజీ సేల్స్ కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సీజన్లో ఆఫర్లకు తోడు ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించినందున సేల్స్ బాగుంటాయని భావిస్తున్నారు. ఈ త్రైమాసికంలో వృద్ధి రేటు గత ఆరేళ్లలో కనిష్టం. అలాగే నిరుద్యోగత 45 ఏళ్ల గరిష్టానికి పడిపోయింది. ఇది సేల్స్ పైన ప్రభావం చూపవచ్చునంటున్నారు.

ధరలు సగం తగ్గిస్తున్నారు సరే.. చేతిలో డబ్బులేవి

‘ప్రతి ఉత్పత్తి కూడా 50 శాతం తక్కువకు మీకు దొరకవచ్చు. కానీ ఖర్చు చేసేందుకు ఆదాయం ఉండాలి కదా’ అని ముంబైకి చెందిన SBICAP సెక్యూరిటీస్ లిమిటెడ్ అనలిస్ట్ నితిన్ గుప్త అన్నారు. సమీప కాలంలో ఎలాంటి ఇన్‌కమ్ బూస్ట్ కనిపించడం లేదని, అలాగే ప్రస్తుతానికి ఊరట ఇండివిడ్యువల్స్‌కు లభించలేదని, కంపెనీలకు లభించిందన్నారు.

కార్లు సహా పలు ఉత్పత్తులపై ఆఫర్లు

కార్లు సహా పలు ఉత్పత్తులపై ఆఫర్లు

గత ఆగస్ట్ నెలలో కార్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. పండుగ సీజన్‌లో కార్ల సేల్ పెంచుకునేందుకు మారుతీ సూజుకీ తన బాలెనో ఆర్ఎస్ మోడల్ పైన రూ.1 లక్ష తగ్గించింది. అలాగే, పలు కార్ల కంపెనీలు ధరలు తగ్గిస్తూ, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పండుగ సీజన్ పైన వివిధ రకాల కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయని, ఇది రైతుల చేతుల్లోకి నగదు తీసుకు వస్తుందని, తద్వారా గ్రామీణ ఆదాయం మెరుగుపడేందుకు సహకరిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల ఏమంటున్నారో తెలుసుకుందా..

SBICAP సెక్యూరిటీస్

SBICAP సెక్యూరిటీస్

పండుగ సీజన్ మందకోడిగా ఉండే అవకాశముందని SBICAP సెక్యూరిటీస్ గుప్తా అన్నారు. కార్పోరేట్ పన్ను తగ్గింపు దీర్ఘకాలిక దృక్పథానికి సంబంధించిన అంశమని, ఇది ప్రస్తుతానికి ఉపయోగపడదని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలను ఎన్ని కంపెనీలు వినియోగదారులకు అందిస్తాయనేది చూడాలన్నారు.

ఎలారా సెక్యూరిటీస్ ఇండియా

ఎలారా సెక్యూరిటీస్ ఇండియా

ఈ పండుగ సీజన్ బ్లాక్ బస్టర్‌గా ఉంటుందని చెప్పలేమని ఎలారా సెక్యూరిటీస్ ఇండియాకు చెందిన హర్షిత్ కపాడియా అన్నారు. గత సంవత్సరం కూడా డిమాండ్ చాలా ప్లాట్‌గా ఉందన్నారు. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో పంపిణీదారులు అందరూ సిద్ధమవుతున్నారని, కానీ ఎవరూ భారీగా నిల్వ చేసే అవకాశం లేదన్నారు. సాధారణంగా ఎప్పుడు ఉన్న డిమాండ్ మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇదివరకు పండుగ సీజన్లో 30 నుంచి 35 రోజుల ముందు తీసుకు వెళ్లేవారని, ఇప్పుడు ఎప్పటిలా 15 -20 రోజుల ధోరణిని అవలంభిస్తున్నారన్నారు.

స్పార్క్ కేపిటల్

స్పార్క్ కేపిటల్

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ అమ్మకాలు సాధారణంగానే ఉన్నాయని స్పార్క్ కేపిటల్‌కు చెందిన రవి స్వామినాథన్ అన్నారు. పండుగ ప్రారంభం ప్రోత్సాహకంగా లేదన్నారు. డీలర్లు రాబోయే రెండు మూడు నెలలు మాత్రం ఆశాజనకంగా ఉన్నారన్నారు.

అంబిట్ కేపిటల్ ప్రైవేట్ లిమిటెడ్

అంబిట్ కేపిటల్ ప్రైవేట్ లిమిటెడ్

ఆటోమొబైల్స్‌కు పండుగ సీజన్ కీలకమని అంబిట్ కేపిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బసుదేబ్ బెనర్జీ అన్నారు. గతంలోనే సేల్స్ అంతగా లేవని, ఇప్పుడు పరిస్థితులు మరింతగా క్షీణించాయన్నారు. ఇన్వెస్టర్లు కొన్ని రకాల ఉత్పత్తులను తగ్గించాలన్నారు.

సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్

సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్

డిమాండ్ ఉందని, కానీ ఖర్చు పరిమాణం తగ్గుతుందని సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన శిరిష్ పర్దేశి అన్నారు. క్లిష్ట సమయం ఉన్నప్పటికీ ప్రజలు కొనుగోళ్లు ఆపరని, ఇంతకుముందు ఏవైనా పెద్ద ప్యాక్స్ కొంటే ఇప్పుడు చిన్న ప్యాక్స్ కొంటారన్నారు. పండుగ సీజన్లో ప్రజలు అన్నీ మరిచిపోయి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశముందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here