ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిది

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నదని, జాతి, కుల, భాష, ప్రాంత బేధాలు లేకుండా మనందరం హిందువులమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారక్‌, సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక జనార్ధన్‌ గార్డెన్స్‌లో ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కోటగల్లి, గాజుల్‌పేట్‌ ప్రాంతాలకు చెందిన స్వయంసేవకులు పాల్గొన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ దేశాన్ని కాపాడుకోవాలసిన బాధ్యత ఈ దేశ వారసులైన హిందువుల మీదనే ఉన్నదని తెలిపారు. అంటరానితనం తప్పు కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకేది తప్పు కాదని, దేశ, ధర్మములు ప్రగతి కోసమే జీవించటమే మన లక్ష్యమని, సాధించటమే మన జీవితమని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఆంజనేయులు, డైట్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ ఆరెస్సెస్‌ నగర సంఘచాలక్‌ తిరుక్కోవల్లూర్‌ శ్రీనివాస్‌, స్వయంసేవకులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here