ధాన్యం కుప్పను ఢీకొని ఇద్దరి మృతి

0
0


ధాన్యం కుప్పను ఢీకొని ఇద్దరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

నందిపేట్‌, న్యూస్‌టుడే: నందిపేట్‌లోని పల్గుట్ట సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీహెచ్‌ కొండూర్‌కు చెందిన దీపక్‌(19), వంశీ, ఉమ్మెడకు చెందిన స్వర్ణరాజ్‌(18) వ్యక్తిగత పని నిమిత్తం నిజామాబాద్‌ వైపు వెళ్తున్నారు. పల్గుట్ట సమీపంలో ఆరబెట్టిన ధాన్యం కుప్పను ఢీకొట్టారు. ఈ ఘటనలో దీపక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వర్ణరాజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వంశీ పరిస్థితి విషమంగా ఉంది.

గ్రామాల్లో విషాదం

ఇప్పుడే వస్తామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన యువకులు కొద్దిసేపటికే మృతి చెందారనే విషయం తెలియడంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి. నిర్మల్‌ జిల్లా వట్టోలి గ్రామానికి చెందిన దీపక్‌ కొంత కాలం నుంచి కొండూర్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. ఉమ్మెడకు చెందిన స్వర్ణరాజ్‌ ఇంటర్‌ చదువుతున్నాడు.  వృద్ధ్యాప్యంలో ఆసరగా ఉంటారనుకున్న కొడుకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here