ధాన్యం కుప్పను ఢీకొని..

0
2


ధాన్యం కుప్పను ఢీకొని..

మనోహరాబాద్‌(జక్రాన్‌పల్లి): ధాన్యం కుప్పను ఢీకొని రాజేందర్‌ అనే యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లికి చెందిన తుమ్మల రాజేందర్‌(35) మనోహరాబాద్‌ వద్ద రోడ్డుపై నిల్వ చేసిన ధాన్యం కుప్పను ఢీకొని కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అంచనూరు(దోమకొండ): దోమకొండ మండలం అంచనూరుకు చెందిన భీమరి సరిత (36) చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయినట్లు దోమకొండ ఏఎస్సై లింబాద్రి తెలిపారు. గత నెల 28న కడుపునొప్పి భరించలేక ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి పంపించగా మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆదివారం చనిపోయినట్లు ఏఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here