ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు

0
2


ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు

నిజామాబాద్‌: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా భాజపా పాలన సాగిస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్‌ నగరంలోని గాంధీ చౌక్‌ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... గత 70ఏళ్లుగా అన్ని పార్టీలు గాంధీజీ ఆశయాలను పట్టించుకోకుండానే పరిపాలన చేశాయని విమర్శించారు. జిల్లాలో గతం కంటే ధాన్యం దిగుబడి రెట్టింపు అయ్యిందని అన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఆయన విమర్శించారు. మార్కెట్‌ యార్డులు కూడా సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసి తగిన ఏర్పాట్లు చేయ్యాలని డిమాండ్‌ చేశారు. సంకల్ప యాత్రలో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు, భాజపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

 

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here